మంచిర్యాల రహదారులు,భవనాలు శాఖ గృహం స్థానంలో మతా,శిశు ఆసుపత్రి నిర్మించినున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 11 : మంచిర్యాల రహదారులు, భవనాలు శాఖ అతిథి గృహంస్థలంలో మాతా,శిశు ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. గురువారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఐ బీ స్థలంలో అనాలోచితంగా నిర్మాణం జరుపుతున్న మార్కెట్ కాంప్లెక్స్ నిలిపి వేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. అలాగే అదనంగా మరో మూడు వందల పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. మంచిర్యాలలో తిలక్ నగర్,ఏసీసీ,గోదావరి రోడ్,సాయి కుంటలో స్మశానవాటికలు నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.ఏసీసీ లో ఆధునాథన సౌకర్యాలతో స్మశానవాటిక నిర్మిస్తున్నామని వివరించారు.గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రెండవ పైపులైన్ తో సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాలలో డంప్ యార్డు సమస్యను రూపుమాపుతానని భరోసా ఇచ్చారు.సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మున్సిపాలిటీ లలో స్వచ్ఛమైన తాగునీరు రోజు సరఫరా చేస్తామని అన్నారు.ఓవర్ బ్రిడ్జిపై 15 లక్షలతో రోడ్ ను వేయడంతో పాటు రోడ్ ఇరువైపుల పూల మొక్కలు,టైల్స్ వేస్తున్న ట్లు తెలిపారు.ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారిగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు.లక్షెట్టిపేటలో తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల భవనం మరమ్మతులకు నిధులు మంజూరు చేయించానని తెలిపారు.నస్పూర్ లో ప్రభుత్వ ఆక్రమానికి గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణి చేస్తానని చెప్పారు.రేషన్ కార్డుల పంపిణీ.500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలు జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ లపై అవిశ్వాసంకు సహకరించిన కౌన్సిలర్ కు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో కాబోయే చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య,వైస్ చైర్మన్ సల్ల మహేష్, కౌన్సిలర్ లు,పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking