బాలకార్మికుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వండి
బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 02 : జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ నిర్వహణ గురించి రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ అద్యక్షతన పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ టీమ్ పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు తో సిపి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులగా పనిచేస్తున్న హాట్ స్పాట్స్ పై నిఘా ఉంచాలి. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలి.స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని మరల స్కూల్ లలో చేర్పించాలి అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల ను గుర్తించి వారిని సంబందిత హాస్పిటల్లో చేర్పించి పరిక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలి. ప్రతి షాప్స్ వద్ద “No Child Labour are employed here” బోర్డ్స్ ఏర్పాటు చేపించాలి. బాల్య వివాహాల చేయడం నేరం.బాల్య వివాహలపై అవగాహన కల్పించాలి.18 సంవత్సరాల లోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల,పశువుల కాపరులుగా,కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో,హోటళ్లలో, ఇటుక బట్టీలలో,పౌల్ట్రీ ఫామ్ లలొ పని చేసిన,పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న,మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటివారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం చేయాలని అన్నారు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి “దర్పన్”అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకొంటామని,ఆపరేషన్ ముస్కాన్ -ఎక్స్ లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. విరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న,లేక వారితో బలవంతంగా పని చేయించిన, తప్పిపోయిన, వదిలివేయబడిన,హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు,1098 లేదా డయల్ 100,స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సీపీ తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సిసియస్ ఏసీపీ వెంకటస్వామి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పెద్దపల్లి శ్రీధర్,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మంచిర్యాల్ చైర్మన్ వహీద్,మంచిర్యాల డి డబ్యూ ఓ చిన్నయ్య,మంచిర్యాల డి ఎమ్ ఎఛ్ ఓ వినీత,డివై డిఎమ్ఎఛ్ఓ పెద్దపల్లి కృపరాణి, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు, ఆపరేషన్ ముస్కాన్ టీం పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.