అధికారులు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేయాలి.
వరదల సమయంలో రెండు మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి.
గర్భిణీ స్త్రీలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు ముందుగా తరలించాలి.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 02 : అధికారులు వరద నీటిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కన్నాయిగూడెం ఎం.పి. డి. ఓ. కార్యాలయంలో వన మహోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మొక్కను నాటి నీళ్ళు పోశారు.
అనంతరం మండల విద్య వనరుల కేంద్రం లో మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు సీజన్ లో పెద్ద ఎత్తున మొక్కలను నాటి” వన మహోత్సవం” కార్యక్రమం విజయవంతం చెయ్యాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలలో గోదావరి నది వరద నీటిని నిలువ చేసే అవకాశం లేకపోవడంతో ఈ వర్షాకాలంలో నేరుగా దాని ప్రభావం సమ్మక్క సారలమ్మ ( తుపాకులగూడెం బ్యారేజ్) పై ఉంటుంది. కాబట్టి స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు గోదావరి నది వరద నీటిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద నీటిపై ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.
ముంపు ప్రాంతాలలోని ప్రజలను తరలించడం కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలన్నారు. ఎలాంటి ప్రాణా హాని లేకుండా అధికారులు సమయ సందర్భాన్ని బట్టి సమయస్పూర్తి ప్రదర్శించాలన్నారు. వర్షాకాలంలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి వరద ప్రవాహంలో నుంచి వాగులు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారని ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకుండా వాగుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని , అదేవిధంగా వర్షంలో వాగులు చెరువులు కుంటలు మత్తడి పారుతుంటే సోషల్ మీడియాలో రీల్స్ పెట్టాలని ఉద్దేశంతో చాలామంది అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారని
ఆ సమయంలోనే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా ఎవరు చేయకూడదని యువతకు సూచించారు.
వరదలు సంభవిస్తే వెంటనే లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు ప్రజలను తరలించాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు బోట్స్ సిద్ధంగా ఉన్నాయని, అదనంగా మరో రెండు బోట్స్ కు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గర్భిణీ స్త్రీలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు ముందుగా తరలించుటకు ఇప్పటికే వైద్య అధికారులకు ఐసిడిఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలకు ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమందికి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు అనే వివరాలు నమోదు చేసుకోవాలని అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలకు త్వరలోనే ఏకరూప దుస్తులను అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
కన్నాయిగూడెం మండలానికి కేటాయించిన బ్యాంక్ ప్రస్తుతం
ఏటూర్ నాగారంలో ఉందని ఆ బ్యాంక్ కన్నాయిగూడెం మండలంలో ఏర్పాటు చేస్తే, ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామ ప్రజలు తెలుపగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ బ్యాంక్ కోసం అనుకూలమైన భవనాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వెంటనే
తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అనంతరం సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ తుపాకుల గూడెం బ్యారేజ్ ను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా బ్యారేజ్ కు 59 గేట్లు ఉన్నవని, కేపాసిటి 6.94 టి ఎంసి, ప్రస్తుతం 32 గేట్లు ఒపెన్ చేయనైనదని 0.76 టి ఎం సి వాటర్ ప్లో అవుతుందని ఇర్రిగేషన్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.
అనంతరం ముప్పన పల్లి గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనం నిర్మాణ పనులను కలెక్టర్ పర్శిలించారు.
అనంతరం కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, బంగారుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలకు ఏకరూప దుస్తులు అదాయా, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, పాఠ్యపుస్తకాలు వచ్చాయా వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎం. పి పి సమ్మక్క, వై ఎస్ ఎం పి పి భాస్కర్, మండల ప్రత్యేక అధికారి వెంకట నారాయణ, తహసిల్దార్ సలీం, ఎం పి డి ఓ అనిత, ఇంజనీరింగ్ అధికారులు, ఎం పి ఓ, ఎం ఈ ఓ, సిడి పి ఓ, ఏ ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.