మానవత్వం పరిమళించిన వేళ.. 

 

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాచ్ మెట్స్ ఆర్దికసహాయం..

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)జులై 2:

మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, చేతుల మీదుగా కుటుంబసభ్యులకు ఫిక్స్ డిపాజిట్ పాస్ బుక్ అందజేత..

ఇటీవల గూడూరు లో లారీబోల్తా పడి అందులోని జామాయిల్ కర్ర మీద పడడంతో ప్రమాదంలో మరణించిన ధనసరి పాపారావు (2018 బ్యాచ్ ) వారి తోటి సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయానికి వచ్చిన పాపారావు బ్యాచ్ కు చెందిన సిబ్బంది అంతా కలిసి రూ. 2లక్షల 25 వేల రూపాయలు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి తమ వంతు ఆర్థిక భరోసా కల్పించారు. వారు సేకరించిన డబ్బుతో పాపారావు పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు.
ఈ పాలసీకి సంబంధించిన పాస్ బుక్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ చేతుల మీదుగా వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ..కార్యక్రమంలో *అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, 2018బ్యాచ్ సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking