ఆర్.ఎం.పి, పి ఎం పి సమస్యల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని టి.ఆర్పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఆర్.ఎం,పి.ఎం.పి సమస్యల పరిష్కారానికై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని కలిసి వినతి పత్రంఇవ్వడం జరిగింది
ఈరోజు జూలై 2వ తేదీన ప్రొఫెసర్ ప్రొ.ఎం.కోదండరాం & విజ్ఞాన దర్శిని రమేష్ ల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని ఆర్.ఎం.పి, పి.ఎం.పి సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర నాయకులు చొప్పరి శంకర్ ముదిరాజ్, సిహెచ్.బాలబ్రహ్మచారి, ఎం.డి.హుసేన్, ఎస్.వెంకటరెడ్డి, పులగం మోహన్ లు కలవడం జరిగింది. మంత్రితో కూలంకషంగా జీవో నెంబర్ 429, జీవో నెంబర్ 1273, జీవో నెంబర్ 428 లతో పాటు అనేక విషయాలు వివరించడం జరిగింది. ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు ఎలా ఎంతమందికి జరిగింది? ఇంకా ఎంతమందికి శిక్షణను ఇవ్వాలి? వంటివి వివరించడం జరిగింది.
కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తింపు సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
మెడికల్ కౌన్సిల్ దాడులను నిలిపివేసి పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరడం జరిగిందన్నారు.