మహబూబాబాద్ లయన్స్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాల్ నందు డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు..
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)జులై 2:
మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బి నెహ్రూ నాయక్ ల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు గార్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చింతా రమేష్- ప్రేమలత దంపతులను లయన్స్, డాక్టర్స్ ఘనంగా సన్మానించారు.
ఈ..వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 24 / 7 నిరంతరం విధులు నిర్వహిస్తూ అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు ప్రత్యక్ష దేవుళని కొనియాడారు.
వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాదని, సామాజికసేవ అన్నారు.
ఇలాంటి వైద్య వృత్తిని ఎంచుకోవడం ఎంతో గర్వకారణం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ బి రూప్ లాల్, లయన్ రీజనల్ చైర్మన్ రామసహాయం వెంకట్ రెడ్డి, జోన్ చైర్మన్ రావుల రవిచందర్ రెడ్డి, క్యాబినెట్ సెక్రటరీ అనుమల వెంకటేశ్వర్లు, క్లబ్ కార్యదర్శి చాడ అశోక్ రెడ్డి, కోశాధికారి అనుమాల సిద్ధార్థ్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ ఎస్ సురేందర్, కోశాధికారి డాక్టర్ వైదేహి లతోపాటు లయన్స్ పాస్ట్ చైర్మన్ మాధవ పెద్ది వెంకటరెడ్డి, లయన్స్ పరకాల శ్రీనివాస్ రెడ్డి, కొండపల్లి కేశవరావు, పమ్మి సనాతన చారి, లక్ష్మీనారాయణ, ప్రదీప్ రావు, కొండపల్లి కరుణాకర్ రెడ్డి, వైద్యులు జగన్మోహన్ రావు, అర్జున్ రెడ్డి, దేవిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ప్రమోద్ రెడ్డి, రంజిత్ రెడ్డి, తల్లాడ సతీష్, బొడ్ల మధుసూదన్ రావు, అనిల్ గుప్తా, సూర్యకుమారి, భారతి, అనిల, సునీత తదితరులు పాల్గొన్నారు.