రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 జూలై 2024:
ఉచిత ఆరోగ్య శిభిరాలలో నిస్వార్థ భావంతో సేవలందించిన 17 మంది డాక్టర్స్ ను వీ.ఆర్.4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్లను వారి వారి క్లినిక్/హాస్పిటల్స్ కు వెళ్ళి నిన్నటి రోజున జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా
కలసుకొని సగౌరముగా చిన్న పాటీ మెమోంటో బహుకరించి సన్మానించడం జరిగినదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ సన్మాన గ్రహీతలలో డాక్టర్ రావ్స్ ఈ.ఎన్.టీ జి.వీ.ఎస్ రావు, శ్రీ రావు, అభిఘ్న, ప్రఖ్యాత ఎముకల డాక్టర్ శ్రీరామ్ క్లినిక్ బొగ శ్రీనివాస్, అక్షయ పంటి డాక్టర్ శ్రీనాథ్, స్త్రీల వైద్య నిపిణురాల్లు దివ్య బచ్చు, నాగేశ్వరీ, ఎన్. ప్రభావతి, కంటి డాక్టర్ మొహమ్మద్ అహ్మద్, జనరల్/మధుమేహ డాక్టర్ నరసింహా రావు, డాక్టర్ శ్రీనివాస్, పీ.పీ రమ్య, న్యూరొ డాక్టర్ చక్రధర్ రెడ్డి, గుండె డాక్టర్ శ్రీరాములు, ఆక్యుపంక్చర్ డాక్టర్ ఆడేమ్ మనోహర్, నోయెల్ ఫార్మా మందుల తయారీ ధారు డాక్టర్ సత్య జగదీశ్, తబ్రెజ్ హుస్సేన్ లకు సాదరంగా ట్రస్ట్ తరపున సన్మానించడం జరిగింది.