ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా, ఎన్నికల అధికారి గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 27:
మల్కాజిగిరి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా పర్యవేక్షణలో ఎన్నికల అధికారి గౌతమ్ రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి హాల్ లో మల్కాజ్గిరి జిల్లాకు సంబందించిన ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, క్కుత్బుల్లాపూర్ , కూకట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2425 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 12230 మందిని రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. 2425 పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ ఐ సి సాఫ్ట్ వెర్ వినియోగిస్తూ ఆన్లైన్ లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తీ చేయడం జరిగింది. పిఓ లు , ఏ పి ఓ లు , ఓ పి ఓ లు ఉన్నారని తెలిపారు. ఐదు నియోజక వర్గాలకు గాను 2861 టీమ్స్ ఉన్నాయని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి రెండవ ర్యాండమైజేషన్ కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2425 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఓ పి ఓ లను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిషేక్ అగస్త్య , విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ, డి ఈఓ విజయ కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.