ఈ నెల 30 న జమ్మికుంట కు రానున్న సిఎం రేవంత్ రెడ్డి.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలి బహిరంగ సభ.
వోడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్.
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 27
జమ్మికుంటలో ఈనెల 30 వ తేదీన జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ పార్లమెంట్
పరిధిలో తొలి భారీ బహిరంగ సభ లో పాల్గొననున్న సిఎం రేవంత్ రెడ్డి.కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకర్గాల్లోనీ ప్రజలు వచ్చి సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ మీడియా సమావేశంలో అన్నారు.సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హుజురాబాద్ కు రానున్న రేవంత్ రెడ్డి.గ్రామ గ్రామాన వాడ వాడలా ఇందిరమ్మ ఇళ్లులు ఉన్నాయా,కేంద్రం కట్టించిన డబుల్ బెడ్ రూం ఉన్నాయా అని చూడండి అని అన్నారు.సభకు సంభందించి భారీ ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, వేసవి కాలం దృష్ట్యా సభకు హాజరయ్యే ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలనీ, సభకు హుజురాబాద్ నుండే కాకుండా పక్కన నియోజకవర్గాలైన
హుస్నాబాద్,మనకొండూర్ నియోజకవర్గం నుండి ప్రజలు వస్తున్నారనీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో 5 గ్యారెంటీలను అమలు చేశామని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలోపే ఉచిత బస్ సౌకర్యం మహిళలకు కల్పించమని తెలిపారు.మాట ఇచ్చాము అంటే మాట నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15 లోపు 2లక్షల రుణమాఫీ చేస్తాననీ తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉండి మీరు చేయలేకపోయారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు చేసి చూపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మార్పు మొదలైయ్యింది, ఉద్యోగుల్లో మహిళల్లో,రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గురించి మనం ఆలోచించాలి.ఒకరేమో 5ఏళ్లు ఎంపీగా ఉండి ప్రజాలకు చేసిన అభివృద్ధి శూన్యం.బీజేపి అభ్యర్థి బండి సంజయ్ చేసిన అభివృద్ధి చెప్పుకోక రాముడి ఫోటోతో ఓట్లు అడగాల్సిన దుస్థితి,దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కునే స్థితికి దిగజారారు. స్కూళ్ళు, కాలేజీ, కంపెనీ లు పార్లమెంట్ పరిధిలోకి తీసుకువచ్చింది లేదు.2009 లో ఎంపిగా ఉన్న పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఇంకా ప్రజల మధ్యలో మదిలో ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీస్ సౌకర్యం, నవోదయ,గ్రామాల్లో బోర్స్, జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణలాంటి ఆనేక అభివృద్ధి పనులు చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి రాష్ట్రంలో కార్ షెడ్డుకు పోయినట్టే అభ్యర్థి కూడా ఇంటికి వెళ్ళలసిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపి మాత్రమే. జూన్ 3 తారీఖున భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేస్తారు. ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.ఇలాంటి మాటలు బంద్ చేయాలి.భారీ మెజారిటి తో కాంగ్రెస్ పార్టీగెలుస్తుందని అన్నారు. హుజురాబాద్ స్థానిక శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి కొంత సంస్కారంతో మాట్లాడితే బాగుండేది,మనిషి పెరిగిన ఇంకా నేర్చుకునేది చాలా ఉంధి. వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలి.మీ పార్టీలో మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. అధికారం పోయి, ప్రభుత్వం పోగానే ఆగం ఆగం అవుతున్నారు. మంత్రులపై అవాకులు చవాకులు పేలితే నియోజకవర్గంలో తిరగనివ్వం. పార్టీ అధ్యక్షుడు వెంట ఉంటేనే అర్థం అయ్యింది మీ భవిష్యత్ ఎంటో అని మీరే అర్థం చేసుకోవాలి.డైలాగులతో ప్రజలను మభ్య పెట్టుడు ఆపండి. ఇటివల సోషల్ మీడియాలో ప్రజలలో ఉనికి పోతుంది అని జమ్మికుంట చేనేత కార్మికుల దగ్గరికి వెళ్లి వీడియో తీసి పెట్టారు.మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూలై నుండి సెప్టెంబర్ వరకు ఏందుకు చేనేతలకు పాత బకాయిలు చెల్లించలేదు. కమలాపూర్ 40 లక్షలు, హుజురాబాద్ 60 నుండి 70 లక్షలు ఎందుకు కార్మికులకు చెల్లించకుండా కాలయాపన చేశారు.చేనేత కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఎలెక్షన్ కోడ్ అయిపోగానే వారికి రావాల్సిన బకాయిలను చెల్లిస్తాం.నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అంటే దానికి ఉదాహరణ బీజేపీ పార్టీ.హిందూ ముస్లిం మత విద్వేషణ రెచ్చగొట్టి విడదీసి ఓట్లు అడుగుతున్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 12 నుండి 14 వరకు ఎంపీ సీట్లను తెలంగాణాలో గెలుచు కోబోతున్నమని తెలిపారు.ప్రజలు ఆలోచించి హుజురాబాద్ నుండి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ సీనియర్
నాయకులు జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు వేముల పుష్ప లత, పూదరి రేణుక, కాంగ్రెస్ సీనియర్ నాయకులు.ఎర్ర శ్రీనివాస్, సొల్లు బాబు, తవ్వటం రవీందర్, గూడపు సారంగపాణి, మోలుగురి సదానందం, బాలసాని రమేష్, దేశిని ఐలయ్య, సదానందం,
దొంత రమేష్ , కొల్లూరి కిరణ్, కుమార్, గూడూరి స్వామి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
