జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

 

ఎన్నికల అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఎస్.ప్రియాంక శుక్లా

పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి జిల్లాలో నోడల్ అధికార్లకు,పోలీస్ అధికారులు తమరికి కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ ఎన్నిక విధులు ప్రశాంతంగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఎస్.ప్రియాంక శుక్లా అన్నారు.
శనివారం రోజున కలెక్టరేట్ లోని కలెక్టర్ వి సి హాల్ లో జరిగిన సమావేశంలోపోలీస్ అబ్జర్వర్ డాక్టర్ రామేశ్వర్ సింగ్, వయ్యపరిశీలకులు మనోజ్ అలోయిస్ లక్రా, దృవ్ భోళా జిల్లా ఎన్నికల అధికారి, గౌతమ్ ఎన్నికల పోలింగ్ సరళి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలకు లకు వివరించారు. పోలీస్ అధికారులు, ఏ ఆర్ ఓ లు, నోడల్ అధికారులు ఈ సమావేశం పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం లో స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు అని అన్నారు. ఎస్ ఎస్ టి , ఎఫ్ ఎస్ టి , వి ఎస్ టి , అకౌంటింగ్ టీం, ఎం ఎం సి , ఎక్స్సైజ్ సభ్యులు సమర్ధవంతంగా భాద్యతలు నిర్వహించాలని జనరల్ అబ్సర్వర్ ఆదేశించారు.
ఎఫ్ ఎస్ టి , ఎస్ ఎస్ టి, వి వి టి , వి ఎస్ టి, ఎం సి ఎం సి, ఎం ఎసి ఎం సి , నోడల్ అధికారులు సమన్వయము చేసుకుంటూ పని చేస్తున్నారు అని ఎన్నికల అధికారి, గౌతమ్ తెలిపారు . మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం 3779596 ఓటర్లు ఉన్నారని , జిల్లా లో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములు 24 /7 పర్యవేక్షణ చేస్తుంటారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. డి సీ పి పద్మ పోలీస్ అబ్జర్వర్ కి వివరిస్తూ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఇప్పటికే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు . పోలీస్ యంత్రంగం సిద్ధంగా ఉందన్నారు . ఎన్నికలకు సంబంధించి గుర్తించిన రూట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, సరిహద్దు చెక్ పోస్టులలో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తి నిఘాతో నిరంతరం తనిఖీ లు చేపడుతున్నామని అన్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని , తనికీలు ముమ్మరంగా చేయడం జరిగిందన్నారు.
ఎం ఎం సి కమిటీ ద్వారా చెల్లింపుల వార్తలను గుర్తించడం ప్రచురణ ముందస్తు అనుమతులు లేకుండా ప్రకటనలను ప్రచారం చెయ్యడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియా లో అభ్యర్థులు రాజకీయ పార్టీ ప్రకటనల వంటివి సకాలంలో ఆమోదిస్తూ , మంజూరు చెయ్యాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ స్లిప్పులను ఓటర్లందరికి పంపిణి జరిగేలా చూడాలన్నారు .
ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించడంపై సమర్ధవంతమైన చర్య తీసుకోడానికి సాధారణ ప్రజలు సి ” విజిల్ యాప్ ను ఉపయోగించవచ్చని తెలిపారు. ఈ యాప్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కి సంబంధించిన ఫిర్యాదులను కేవలం 100 నిమిషాలలో పరిష్కరిస్తామని చెప్పారు .
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్, డి సీ పి,నిఖిత పంత్, డి సీ పి పద్మ, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, విజేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking