కరీంనగర్ పార్లమెంటుపై బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం.

 

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మార్నింగ్ వాక్.

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విపలం.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 27

పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శనివారం మార్నింగ్ వాక్ లో భాగంగా జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీగా అమలులో తీవ్రంగా విఫలమైందని అన్నారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయానికి సరిపడా నీళ్లు అందించలేదని అన్నారు. అలాగే రైతుబంధు, రుణమాఫీ బోనస్ లు ఇస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గాన్నీ కనీసం తొంగి కూడా చూడలేదు అన్నారు. తెలంగాణ ఉద్యమం లో వినోద్ కుమార్ పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో పర్యాయాలు కేంద్రాన్ని నిలదీశారన్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ తో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా వినోద్ కుమార్ దే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమేనని చేతుల ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం తరఫున 50 వేలకు పైచిలుకు మెజారిటీ వినోద్ కుమార్ కు ఇవ్వాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ సమస్యలపై పోరాటం చేయాలంటే అది వినోద్ కుమార్ తోనే సాధ్యమని ప్రజలంతా గుర్తించాలన్నారు. ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తే సత్తా ఉందన్నారు. అనంతరం బైక్ ర్యాలీ ద్వారా జమ్మికుంట పట్టణం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్మణ రావు, టిఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking