మెదక్ ఏప్రిల్ 27 ప్రజాబలం న్యూస్ :- మెదక్ పార్లమెంటుకాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కో ఇంచార్జిగా నార్సింగి మండల కేంద్రానికి చెందిన యాదగిరి నియామకం అయ్యారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ చేతుల మీదుగా యాదగిరి నియామకం పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని.. ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు, మిద్దెల జితేందర్ కు అయన ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.