అంబర్పేట్‌ లో దానం నాగేందర్‌ పాదయాత్ర

అంబర్పేట్‌ నియోజకవర్గంలో జోరుగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభ ఎన్నికల ప్రచారం.

శనివారం నాడు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం లోని అంబర్పేట్‌ నియోజకవర్గం లో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వి. హనుమంతరావు అంబర్పేట్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ మరియు ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి ఆధ్వర్యంలో, అంబర్పేట్‌ డివిజన్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ యొక్క ఐదు గ్యారంటీలను వివరిస్తూ ,చేతి గుర్తుకే ఓటు వేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్‌గౌడ్‌ ,కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకులు దిడ్డి రాంబాబు రమేష్‌ ,మహిళా నాయకురాలు ఉషశ్రీ, తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking