హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పాదయాత్రలో భాగంగా శనివారం గోషామహల్ నియోజకవర్గంలోని గోషామహల్ ఏసీపీ ఆఫీస్ నుండి బీఆర్‌ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర మొదలుపెడుతూ ఇంటింటి ప్రచారం చేసారు..

ప్రతి ఇంటికి వెళ్తు వారి సమస్యలు తెలుసుకుంటూ, మీ కష్టాలకు తోడుగా ఉంటా, మిలో ఒకడిగా ఉంటా, మీ సమస్యలే తన సమస్యలే భావిస్తాను,అని మాల మైసమ్మ గుడి, ఆర్యాసమాజ్, సెవెన్ టెంపుల్, హనుమాన్ బడా, చక్నవాడి,రజాక్పుర, సీతారాంపేట్, మంఘాల్ హాట్, గొడ్ కె కబార్ తదితర ప్రాంతాలల్లో ప్రచారం నిర్వహిస్తు బిఆర్‌ఎస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించగలరని అభివృద్ధి కై పాటు పడుతనని ఓటర్లను కోరారు..

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ,మహిళా కార్యకర్తలు, పాదయాత్రలో పాల్గొన్నారు.
