లక్షెట్టిపేటలోని ఎన్నికలకు సంబంధించిన అధికారులతో మీటింగ్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని మండల పరిషత్ మీటింగ్ హాల్ లో తహశీల్దారు ఎన్నికల సంబంధించి మీటింగ్ నిర్వహించనయినది.శనివారం ఈ మీటింగ్ లో ఎస్సై చంద్ర కుమార్ సెక్టోరల్ ఆధికారులు సరోజ,మధుసూదన్,మండల పరిషద్ అభివృధి అభికారులు, నాగ చైతన్య, మనిమ్ రావు డి ఈ ఈ.గౌతం,ఏ ఈ సూపర్వైసర్లు పంచాయతీ సెక్రీటరీలు,బూత్ స్థాయి అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలు చేయ వలసిన పనుల గురించి వివరించారు.విటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ గురించి వివరించారు.ఎన్నికల రోజు మే 13 వ తారీఖు కావున ఎండలు విపరీతంగా ఉంటాయి కావున ఓటర్లకు కావలసిన నీడ కొరకు టెంట్ మరియు అందరికీ త్రాగు నీరు ఏర్పాటు చేయ వలసిన గా పంచాయతీ సెక్రటరీలను కోరినారు.ఆరోజున మెడికల్ సిబ్బంది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఓఆర్ఎస్ పాకెట్ లతో పాటు మెడికల్ సిబ్బంది ఉండాలని ఆదేశించారు.ఎస్సై శాంతి భద్రతల పరి రక్షణ గురించి వివరించారు.ఎంపిడిఓ మడం సరోజ ఎన్నికల రోజున అన్ని అరేంజ్మెంట్స్ చేయవలెనని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఇతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking