అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ (ఐజీ) ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02 : రామగుండం పోలీస్ కమిషనరేట్ అర్ముడ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ టి.మధు పీసీ.352 అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య లత, కుమారుడు సాయి చరణ్ లకి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయల)చెక్ ను మంగళవారం రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ (ఐజీ )ఎం.శ్రీనివాస్ తన కార్యాలయంలో వారికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు,వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిస్స్ ను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర,ఏ ఓ అశోక్ కుమార్,ఆర్ ఐ అడ్మిన్ దామోదర్,ఆర్ఐ హోం గార్డ్స్ మల్లేశం,రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సూపరింటెండెంట్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking