ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ఈ రోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వడదెబ్బపై పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్ అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ మరియు కిషోర్ కుమార్ తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు అధికమౌతున్నందున వడదెబ్బ బారిన పడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్త లు పాటించవలెను కోరారు. వడదెబ్బ లక్షణాల గురించి వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీ లో “వడదెబ్బ” గురించి టామ్ టామ్ చేయాలని ఆదేశించారు.
ప్రతి ఆశా కార్యకర్త వద్ద, గ్రామ పంచాయతీలో అంగన్వాడి సెంటర్లలో ,ఆరోగ్య ఉప కేంద్రాలలో ఓ.ఆర్.ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.