నాచగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరు కళ్యాణ మహోత్సవం.

పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో అన్నపూర్ణ సత్యనారాయణ.

అధిక సంఖ్యలో హాజరైన భక్తులు.
లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు బారిగా ఏర్పాట్లు.

మెదక్ నాచారం గుట్ట ఎప్రిల్ 1 ప్రజా బలం న్యూస్ :-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం నాచగిరిలో వెలసిన తెలంగాణలో రెండవ యాదాద్రిగా నెలకొన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో శిరంశెట్టి అన్నపూర్ణ గారి సమక్షంలో వైభవంగా కొనసాగుతున్నయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి ఉత్సవాల్లో కీలకమైన తిరు
కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి కమనీయం కనుల పండుగగా నిర్వహించారు,ముందుగా లక్ష్మీదేవి, నృసింహ స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కల్యాణ మండపంలో ప్రతిష్ఠించారు,అనంతరం తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ కల్యాణ మహోత్సవం జరిపారు, అంతకుముందు ఆలయ ఈవో
శిరంశెట్టి అన్నపూర్ణ సత్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు, ఈ వేడుక చూసేందుకు జంట నగరాలు నుంచే కాకుండా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి, తిరు కళ్యాణం కనులారా చూడడానికి, నాచారం గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాచారం గుట్ట దేవస్థానం ఆలయ సిబ్బంది , వేద పండితులు, పురోహితులు , బ్రాహ్మణులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking