ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి13,
ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు.బుధవారం హసన్ పర్తి మండలం రామారం సమీపంలో ని సహ వికాస భవనంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తుల సమయంలో సేవలను అందించేందుకు ఎంపిక చేసిన ఆపద మిత్ర వాలంటీర్ల మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్నిజిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ప్రారంభించారు. ఆపద మిత్ర వాలంటీర్లు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సమాజానికి సేవలను అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, విపత్తుల నిర్వహణ అంశాలను ఆపద మిత్ర వాలంటీర్లు అందించే సేవలు గురించి అవగాహన కల్పించారు.
జిల్లా అగ్నిమాపక అధికారి, ఆపద మిత్ర శిక్షణ నోడల్ అధికారి మామిడి భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి అశోక్, హనుమకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి నాగరాజు, పరకాల అగ్నిమాపక అధికారి రాజేంద్రం, జిడబ్ల్యూఎంసీ డీ.ఎఫ్.వో శంకర్ లింగం, ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఇ.వి. శ్రీనివాస రావు, శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.