ఎన్నికల సంఘం నియామావళి మీడియా కూడా పాటించాలి.

ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు శిక్షణ

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి13 ::

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హల్ లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియామావళికి లోబడి ఎంసిసీ, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ), సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన/
శిక్షణ శిబిరం నిర్వహించరూ.
ఈ అవగాహన కార్యక్రమంలో త్వరలో జరిగే లోకసభ ఎన్నికలలో ఎంసిసీ, ఎంసీఎంసీ, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా అంశాలపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకషంగా మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా శిక్షణను ఉద్దేశించి శిక్షణ ప్రతినిధులు మాట్లాడుతూ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఛైర్ పర్సన్ గా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, MCMC కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ , ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్ అయిన తదుపరి మాత్రమే ప్రచురణ, పోస్ట్, ప్రసారం చేయాలని, కేబుల్ చాన్నేళ్లలో, సోషల్ మీడియా లో ప్రసారమయ్యే, పోస్టు చేయబడే అన్ని వార్తలు కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లో 24×7 ఎంసీఎంసీ పర్యవేక్షిస్తుంది.
సోషల్ మీడియాగా పిలువబడే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యుట్యూబ్ ల ద్వారా ప్రచారమయ్యే వార్తలను సోషల్ మీడియా పర్యవేక్షణ బృందం నిత్యం పరిశీలిస్తూ ఎంసిసి నిబంధనలు అత్రిక్రమించినచో సంబంధిత వ్యక్తులు,మీడియా పై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,
పోలింగ్కు ఒక రోజు ముందు, పోలింగ్ రోజు ఏదేని అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీడియా సర్టిఫికేషన్ పొందిన తదుపరి ప్రచురించాలని తెలిపారు.
అనంతరం ఎంసీఎంసి, సోషల్ మీడియాపై మీడియా ప్రతినిధుల సందేహాలను ఎంసీఎంసి, సోషల్ మీడియా బాధ్యులు, మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా మీడియా నోడల్ అధికారి ఆయుబ్ అలీ, జిల్లా యం సి సి నోడల్ అధికారి బాల కృష్ణ, ఎంసీఎంసి సభ్యులు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, మెండు రవీందర్, సోషల్ మీడియా సభ్యులు విష్ణువర్ధన్, మాస్టర్ ట్రైనర్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking