జమ్మికుంట తహసిల్దార్ రజిని ఇంట్లో ఏసీబీ సోదాలు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 13

జమ్మికుంట తహసిల్దార్ రజిని ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులపై ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు చేస్తున్నారు. బుధవారం హనుమకొండ కే ఎల్ ఎన్  రెడ్డి కాలనీ లోని తహసిల్దార్ రజని ఇంట్లో, ఆమె బంధువుల ఇళ్లల్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు తహసిల్దార్ ఇంట్లో దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking