జర్నలిస్టుల సమస్యలపై కలసికట్టుగా పోరాటం చేయాలి.

టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి.

జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి మార్చి 12

జర్నలిస్ట్ ల సమస్యలు, వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని కరీంనగర్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కే తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘాలు ఏదైనా జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా అందరూ ఏకతాటిపై నడిచి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు తమ సేవలను అందించాలని ఆయన అన్నారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘంలో చేరిన పలువురు జర్నలిస్టులకు ఆయన సభ్యత్వాలు అందించారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘం బలోపేతానికి సభ్యులందరూ కూడా సహకరించి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ ప్రధాన కార్యదర్శి అయిత రాధాకృష్ణ, ఫెడరేషన్ సభ్యులు న్యాయ పోరాటం సబ్ ఎడిటర్ సంధ్యల వెంకన్న నవతెలంగాణ ఆర్ సి బొద్దుల రాజకుమార్, మనం పత్రిక రిపోర్టర్ దాము, జన సముద్రం సబ్ ఎడిటర్ పల్లె సతీష్, జన సముద్రం రిపోర్టర్ మట్టెల సంపత్, తెలంగాణ తేజ పత్రిక ఎస్ వెంకన్న, చంద్రమౌళి, చల్లూరి రాజు,తథాగత పత్రిక మొలుగు రమేష్ పలువురు రిపోర్టర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking