జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి మే 6
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జమ్మికుంట మాజీ ఎంపీపీ ఏబూసి రామస్వామి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ నరేంద్ర మోడీ కి దేశం మీద ఉన్న భక్తి, ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్న తరుణంలో భారతదేశం బాగుండాలంటే మనందరం కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ బిజెపి అభ్యర్థులను బలపరచాలని, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 12,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వారి శ్రమకు మనం ఫలితాన్ని అందించాలని అందుకోసమే బిజెపిలో చేరుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, బిజెపి ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడిమల్లేష్, బూత్ అధ్యక్షుడు పొన్నగంటి రవికుమార్,ఆకుల పోచయ్య,పొనగంటి సతీష్, ఆదర్శ్, పొనగంటి ప్రశాంత్, పొన్నగంటి మల్లయ్య, పచ్చిమట్ల శ్రీకాంత్, సిరియాల విజయ్,బోనగిరి అరుణ్, అంజి, వెంకటేష్, కామిశెట్టి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.