టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ తాత్కాలిక కార్యదర్శిగా ఏబూసి సంపత్

 

హుజురాబాద్ ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 24

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శిగా జమ్మికుంట పట్టణానికి చెందిన ఏబూసి.సంపత్ ను నియోజకవర్గ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా నాయకులు అరికిల్ల భానుచందర్, దొడ్డ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న అయిత రాధాకృష్ణను తొలగిస్తున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ సమస్యల పరిష్కార దిశగా ప్రతి ఒక్క జర్నలిస్టు పనిచేయాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశం లో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్, సహాయ కార్యదర్శి ఎండి ఖాజా ఖాన్, కోశాధికారి దయ్యాల సుధాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking