మెదక్ తుప్రాన్ సెప్టెంబర్ 24 ప్రాజబలం న్యూస్ :-
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తుప్రాన్ మండల శాఖ ఆధ్వర్యంలో కిష్ట పూర్, ఇస్లాం పూర్, నాగుల పల్లి, గుండ్రడి పల్లి పాఠశాలల లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జిటి లకు అవకాశం కల్పించాలని,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని,
317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ప్రాథమిక పాఠశాలల కు హెచ్ఎంల పోస్టులు మంజూరు చేసి, వాటిని భర్తీ చేయాలని, పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డీ ఏ లను, జిపిఎఫ్ బకాయిలను వారి ఖాతాలోవెంటనే జమ చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, తూప్రాన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాను ప్రసాద్ గౌడ్, సంతోష్,సంజీవ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
