ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి సెప్టెంబర్ 24 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన తేలు నారాయణ – విజయ కుమారి (లేటు )దంపతుల ఏకైక కుమారుడు పి వై ఎల్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు గ్రామానికి చెందిన పూల ప్రభాకర్ – పెంటమ్మ ల ఏకైక కుమార్తె పూల సోనీ ల ప్రేమ వివాహo ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాలలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పార్టీ పెద్దలు బంధువులు శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగింది ఈ వివాహ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, గుమ్మడి నరసయ్య, సిపిఐ ఎం ఎల్ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు పాల్గొని ప్రేమ వివాహం చేసుకుంటున్న నూతన వధూవరులను అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ, రాబోయే రోజులలో కుల, మతాoతర వివాహాలే ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని, యువతీ యువకులు ప్రగతిశీల సమాజాన్ని, అభ్యుదయ మార్గాన్ని, సమ సమాజ నిర్మాణాన్ని కోరుకుంటున్నారని, దీనివలన వరకట్న వేధింపు సమస్యలు, ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉందని ప్రేమ వివాహం చేసుకున్న జంటను మనస్ఫూర్తిగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్ కే పతే మొహమ్మద్, జిల్లా సిపిఐ నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, ఎన్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పాటిబండ్ల ప్రసాద్, ఇమ్మడి రామనాథం, అంబడిపూడి సత్యం, జక్కంపూడి వెంకటేశ్వర్లు, సిరిపురపు రవి, మరియు స్నేహితులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు