ఆర్ ఎమ్ పి చేసిన వైద్యం వికటించి యువకుడు మృతి

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 24 : మంచిర్యాల జిల్లాలోని దండెపల్లి మండలం కొత్తకొమ్ముగూడెం జిపి పరిధిలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన బత్తుల మదుకర్ అనే 26 సంవత్సరాల యువకుడు ఆర్ ఎమ్ పి చేసిన వైద్యం వికటించి మృతి చెందాడు.మృతుడికి ఈనెల 18న జ్వరం రావడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకెల్దామని కుటుంబసభ్యులు నిర్ణయించుకొని కన్నెపల్లి గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్ ను పిలిచి సలహా అడగగా తను ఆసుపత్రికి అవసరం లేదని థానే వైద్యం చేస్తానని చెప్పి సెలయిన్ లో మూడు ఇంజెక్షన్లు కలిపి తనకు పెట్టి నడుముకు ఒక ఇంజక్షన్ వేసి బయటకి వెళ్లగా మృతునికి చలి రావడంతో మళ్ళీ వచ్చి ఇంజెక్షన్లు డోస్ ఎక్కువయ్యాయని మంచిర్యాల ఆసుపత్రికి పంపించగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి పరిస్థితి సీరియస్ గా ఉందని కరీంనగర్ పంపగా అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం అదేరోజు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు తనకి నీకూ లో పెట్టి చికిత్స చేసి ఈనెల 21న బ్రెన్ డెడ్ అయిందని తీసుకువెల్లమని చెప్పగా మృతుని మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించి వేంటిలేషన్పై పెట్టగా మంగళవారం రోజున ఉదయం చనిపోయాడు. మదుకర్ మృతుకి ఆర్ ఎమ్ పి వైద్యుడు కారణమని పిటిషన్ ఇవ్వడంతో లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేఎస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై పి.సతీష్ తెలుపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking