కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకొని సీజ్ చేయాలి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో గల కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు లక్షెట్టిపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం కనీస సౌకర్యాలు లేకుండా మరియు ఫైరు గ్రౌండ్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఎనిమిదవ తరగతి గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు చేపడుతు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు మరియు టై,బెల్టు, పుస్తకాలు అమ్ముతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు తక్షణమే ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ యొక్క పాఠశాల పై విచారణ చేసి చర్యలు తీసుకొని సీజ్ చేసి గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్,బచ్చలి ప్రవీణ్ కుమార్,చేరాల వంశీ,పురేళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking