జనం మెచ్చిన నేత రాహుల్.

– కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యనారాయణ.

వీణవంక ప్రజాబలం ప్రతినిధి జూన్ 19

జోడో భారత్ యాత్ర చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న జనం మెచ్చిన నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
వీణవంక మండలకేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కవ్వంపల్లి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూరాహుల్ గాంధీ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. కాబోయే ప్రధానమంత్రి యువ నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని రెండో స్థానం లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పారు. ఆయన ఇలాంటి నాయకుని వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking