రైల్వే ఉద్యోగులకు ప్రత్యేక వైద్యశిబిరం

– ఉద్యోగుల నుండి విశేష స్పందన.

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జూన్ 19

జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరానికి హాజరైన వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు డయాబెటిస్, గుండె పరీక్షలు ఈసీజీ, ఇలాంటి పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు.డివిజనల్ మెడికల్ ఆఫీసర్ హరిబాబుతో పాటు ఫార్మసిస్ట్ సిహెచ్ తిరుపతి, నర్సింగ్ స్టాఫ్ గాయత్రి ,రేణుక ల్యాబ్ సూపరింటెండెంట్ గోపీనాథ్, రాజు ప్రసాద్, జీ రుపావతి తో కూడిన వైద్య బృంద సభ్యులు ఉద్యోగులకు మెడిసిన్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎండి ఖాదర్ ఖాన్, వెంకటస్వామి, మొయినుద్దీన్, ఎస్ రాజయ్య, బి సమ్మయ్య, డి సారంగపాణి, మొగిలి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking