కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 19:
సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మె జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి జగిత్యాల కలెక్టర్ షేక్ యాష్మీన్ భాష కు ఫిర్యాదు చేశారు.
రైస్ మిల్లర్లు నిర్దేశిత సీఎంఆర్ ఇవ్వకపోవడం రైస్ మిల్లు, ప్రభుత్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
యాసంగికి సంబంధించి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉందన్నారు. విజిలెన్స్ విచారణ చేపట్టి మిల్లర్లపై చర్యలు తసుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు ఉన్నారు.