జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అర్హులైన వారికి సకాలంలో అనుమతులు

జిల్లాను పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందంజలో ఉండేలా చూడాలి

అధికారులతో సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి టీఎస్– ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు అందించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టీఎస్– ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశాన్ని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, అధికారులతో కలిసి జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎంతో అనుకూలంగా ఉందని,దీనివల్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుంటారని వారికి అన్ని రకాల అర్హతలు ఉన్నట్లయితే త్వరితగతిన అనుమతించాల్సిందిగా సూచించారు. జిల్లాలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు సంబంధిత శాఖల వారు పూర్తి స్థాయిలో సహకరించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీఎస్– ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ వివరించారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న పరిశ్రమ ప్రోత్సాహక కమిటీ ద్వారా జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి ఆయా శాఖల ద్వారా జారీ చేయాల్సిన అనుమతులలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే సత్వరమే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. అలాగే టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన వివిధ అనుమతుల మంజురు యొక్క పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అలాగే జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (14) ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.38,72,528, (15) మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.46,13,992, ఇద్దరు జనరల్ పారిశ్రామికవేత్తలకు రూ.3,54,359 పెట్టుబడి రాయితీ కింద మంజూరీ చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ సమావేశంలో వివరించారు. అలాగే జిల్లాలో ఐదు (5) పరిశ్రమలకు ముడిసరుకులు అందులో 3 -బొగ్గు, 2- అల్కహాల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ తో పాటు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking