బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 19:
జైపూర్ మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ జైపూర్ మండల తహసీల్దార్ వనజా రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా డిటిసిపి లేకుండా నాలా కన్వెన్షన్ చేయకుండా వ్యవసాయ భూములను అక్రమ లేఅవుట్లు చేస్తూ గజాల్లో అమ్ముతూ లక్షల్లో అర్జిస్తూ రైతులను కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని అన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూములను గుంటలు ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గజాలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. జైపూర్ మండల తహసిల్దార్ అక్రమ వెంచర్లు అక్రమ రిజిస్ట్రేషన్ లపై చర్యలు తీసుకోని ఎడల జిల్లా కలెక్టర్ మరియు సిఎస్ దృష్టికి తీసుకుపోతానన్నారు.