ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 19 :
మందమర్రి ఏరియా లోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి గురువారం కె. కె – 5 గనిపై ఐ.ఎన్.టి.యూ.సి భాయి బాట నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎన్టియుసి మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య నేతృత్వంలో చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పనికి సరిపడా మాన్ పవర్ ఇవ్వడంలేదని, హాండ్ గ్లౌజులు సప్లై లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. చలికాలం దృశ్య వామ్ కొట్స్ 30 మాత్రమే ఇవ్వడంతో షిఫ్ట్ కు 10 మాత్రమే వచ్చాయని అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వామ్ కొట్స్ అవసరం ఉన్నాయని, పనిముట్లు నాణ్యత లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, డ్రిల్ బిట్స్ సరైన సప్లై లేదని తదితర సమస్యలతో పాటు మహిళా కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. అనంతరం గని మేనేజర్ అందుబాటులో లేనందున జనరల్ షిఫ్ట్ ఇన్చార్జి గారిని కలిసి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా మేనేజర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ ఏళ్ల నాటి కార్మికుల సొంతింటి కలను నిజం చేయడానికి కార్మికులకు ఆర్థిక పెనుబారంగా మారిన పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ మాఫికై ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సహా మండల చైర్మన్ బి.జనక్ ప్రసాద్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్, కేంద్ర జాయింట్ జనరల్ సెక్రెటరీ మిట్ట సూర్యనారాయణ, కేంద్ర కార్యదర్శి పానుగంటి వెంకటస్వామి, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్రావు, మహిళా విభాగం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షురాలు కల్పన, ఫిట్ కమిటీ కార్యదర్శి బీమరపు సదయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ హనుమాండ్ల రాజేంద్రప్రసాద్, నాయకులు పవన్, కృష్ణ మోహన్, కలమండ స్వామి, పెద్దపల్లి రాజం, రాజేందర్, రవి, భూమయ్య, నరేష్, కండే రాజ్ కుమార్, రణవెన రాజ్ కుమార్, చంద్రమౌళి, రమేష్, సురేష్, కొమురయ్య, శ్రావణ్, గణేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.