ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదంగా వైద్య సేవలను పొందాలని జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ ల ప్రత్యేక మైత్రి క్లినిక్ ను అధికారులు, క్రాస్ జెండర్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ట్రాన్స్ జెండర్ వివక్షరహిత వైద్య సేవలను పొందేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసిందన్నారు.ట్రాన్స్ జెండర్లందరూ ఈ మైత్రి క్లినిక్ ల ద్వారా తమ గుర్తింపు కార్డులతో వైద్య సదుపాయాల్ని పొందవచ్చునని అని తెలిపారు. ప్రతి ఒక ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ జెండర్ గుర్తింపు కార్డును పొంది, ప్రభుత్వ అందించు అన్ని రకాల లబ్ది పొందాలన్నారు.ఈ గుర్తింపు కార్డులను పొందేందుకై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు.ట్రాన్స్ జెండర్ లకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 155326 హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, నిర్మల్ సిడిపిఓ నాగమణి, ఏ సిడిపిఓ నాగలక్ష్మి, ట్రాన్స్ జెండర్లు,వైద్యశాఖ అధికారులు,ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking