ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..జాతీయస్థాయిలో అవార్డులు సాధించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో అభినందించారు. ప్రశంసా పత్రం, జ్ఞాపికలను కలెక్టర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. జిల్లాకు రెండు విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అవార్డులు అధికారుల పనితీరుకు కొలమానమని తెలిపారు. కాగా నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గణపతి మహిళా స్వయం సహాయక బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రానికి, ఉపాధి హామీ పథకంలో భాగంగా అధిక పని దినాలు కల్పించినందుకు గాను పెంబి మండలం ఇటిక్యాల గ్రామ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఉపాధి హామీ కూలీల అవార్డులు లభించాయి.ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఎం ఎం. విజయలక్ష్మి, కొండాపూర్ గ్రామ గణపతి స్వయం సహాయక మహిళా సంఘం సభ్యురాలు నవాత్ లక్ష్మి, నిర్మల్ మండల సమాఖ్య అధ్యక్షురాలు నేరెళ్ల ఉమ, వివోఏ దానిమెల సుజాత, అడ్డిగ బోసు, ఆర్.సంతోష్ కుమార్, పి. నర్సయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.