-వెల్ బేబీ షో ప్రాంభోత్సవంలో జి.ఎం దేవేందర్
ప్రజాబలం మందమర్రి డిసెంబర్ 20 :
పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని మందమర్రి ఏరియా జిఎం జి దేవేందర్ అన్నారు. సింగరేణి దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కేకే వన్ డిస్పెన్సరీ లో నిర్వహించిన వెల్ బేబీ షో కార్యక్రమాన్ని సింగరేణి సేవా అధ్యక్షురాలు స్వరూప రాణి దేవేందర్ తో కలిసి ప్రారంభించారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యం కోసం సి అండ్ ఎం.డి. బలరామ్ నాయక్ నేతృత్వంలో యజమాన్యం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమ విజేతలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 23 న సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బహుమతులు అందచేస్తామన్నారు.
-అల్లరి మానిపించేందుకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దు
పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్యామల

ఈకార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా పాల్గొన్న పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్యామల మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడటం వల్ల శారీరక, మానసిక దుర్భలత్వానికి లోనవుతున్నారన్నారు. పిల్లల అల్లరి మానిపించడం కోసం తల్లిదండ్రులు వారికి సెల్ ఫోన్ ఇవ్వడం మానివేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్. ఓ.టూ.జి.ఎం విజయ ప్రసాద్, ఏ.ఐ.టి.యూ.సి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ,
సి.ఎం.ఓ.ఏ.ఐ అధికారి సుధారాణి, పర్సనల్ మేనేజర్ ఎస్, శ్యాంసుందర్, కేకే డిస్పెన్సరీ డీసీఎంఓ కె.నాగేశ్వరరావు, డి.వై.పి.ఎం ఆసిఫ్ హాస్పటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.