పశువులకు సకాలంలో టీకాలు అందించేందుకు కార్యచరణ సిద్ధం చేయాలి

జిల్లావైద్య పశు సవర్ణశాఖ సంచాలకులు డా,, వై. రమేష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 05 : జిల్లాలోని పశువులకు గాలి కొట్టు వ్యాధి నివారణలతో ఇతర వ్యాధి నియంత్రణ టీకాలు అందించేందుకు కార్యచరణ రూపొందించాలని జిల్లా వైద్యశాఖ పశు సవర్ణ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వై రమేష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లోగల రైతు శ శిక్షణ కేంద్రంలో పశు సవర్ణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య పశు సవర్ణ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వై.రమేష్ మాట్లాడుతూ…‌ జిల్లాలోని పశువులకు వ్యాధి నియంత్రణ టీకాలు అందించేందుకు ఈ నెల 15 నుండి ఏప్రిల్ 10 వ తేదీ వరకు సంబంధిత కార్యచరణ రూపొందించాలని,పశు వైద్యుల,పారా వెటర్నరీ సిబ్బంది,గోపాల మిత్రులు సమన్వయంతో పని చేసి రైతులను తమ వివరాలు ఆన్ లో నమోదు చేసినందుకు విధంగా అవగాహన కల్పించాలని, ఫిష్ పాక్స్ వ్యాక్సినేషన్, తైలేరియా వ్యాక్సిలేషన్ ప్రక్రియ ఒక వారంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశులతో కృత్తిమ గర్భ దారుణ అవకాశాన్ని పాడి రైతులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధి జరుగుతుందని తెలిపారు పశు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు ఆరోగ్య సిబ్బందికి సి.పి.ఆర్ ఫై అవగాహన కల్పిస్తూ సి.పి. ఆర్ ద్వారా అపత్కర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు అనంతరం ఈనెల న్యూ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళ వైద్య సిబ్బందికి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు సవర్ణ శాఖ సహాయకులు డాక్టర్ ఎం శంకర్,డాక్టర్ లహరి,పశు వైద్య క్షేత్ర కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking