అర్హులందరికీ గ్యారెంటీ పథకాల లబ్ది చేకూర్చెల చర్యలు :: వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

 

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి5:

అర్హులందరికీ ప్రభుత్వ గ్యారెంటీ పథకాల లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, ఎన్ పిడిసిఎల్ ఎస్ ఈ మధుసూదన్ లతో కలిసి ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు, సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదుపై మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎం పి డి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు, ప్రజాపాలన సాఫ్ట్ వేర్ ద్వారా లబ్దిదారుల వివరాల నమోదు, అర్హులకు గ్యారెంటీ పథకాలు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజా పాలన కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేశామని, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తుదారులకు ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు.
గృహ జ్యోతి క్రింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో బిల్లులు పంపిణీ చేస్తున్నామని, ప్రజా పాలన దరఖాస్తు సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేసుకోని దరఖాస్తు దారులు
ఎంపిడిఓ , మ్యూనిసిపల్ కార్యాలయాల్లో, జిడబ్ల్యూఎంసీ పరిధిలో ఏర్పాటుచేసే 12 ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా తప్పులను సవరించుకోవాలని, కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలను ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలలో తమ అర్హతను పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రజా పాలన సేవా కేంద్రాల్లో వినియోగించే సాఫ్ట్వేర్ పనితీరును క్షేత్రస్థాయి సిబ్బందికి సంపూర్ణంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారుల ఆధార్ కార్డు/తెల్ల రేషన్ కార్డు వివరాల ద్వారా ప్రజా పాలన దరఖాస్తును గుర్తీంచాలని, అనంతరం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్/విద్యుత్ మీటర్ నెంబర్ మ్యాచ్ ఐతే సదరు లబ్ధిదారులను గ్యారంటీ పథకాల క్రింద ఎంపిక చేసామని, వివరాలు మ్యాచ్ కాని పక్షంలో మరోసారి సరైన వివరాలు నమోదు చేయాలని అన్నారు. తెల్ల రేషన్ కార్డు వివరాలను ముందుగా వ్యాలిడేట్ చేయాలని, ముందస్తుగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారినిగా గుర్తించిన తర్వాత సదరు దరఖాస్తుదారులు అందించే గ్యాస్ కనెక్షన్ నెంబర్ వివరాలు, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు వ్యాలిడేట్ చేయాలని అన్నారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శివ ప్రసాద్ రెడ్డి, జెడ్పి డెప్యూటీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking