పల్కల్ ఫ్యాక్స్ చైర్మన్ అనంతరావు కులకర్ణి
సంగారెడ్డి, మెదక్, మార్చి. 5. ప్రజాబలం న్యూస్ :-
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా లో జరిగిన సభ లో పుల్కల్ పిఎసిఎస్ చైర్మన్ అనంతరావు కులకర్ణి భారతదేశ ప్రధానమంత్రి తో మాట్లాడుతూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పాటు అనుబంధ సంస్థల పనితీరు అలాగే అర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్, తదితర ధార్మిక సంస్థల ఉనికి గురించి వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ బిజెపి నాయకులు, పుల్కల్ మండల ప్యాక్స్ చైర్మన్, అనంతరావు కులకర్ణి మాట్లాడుతూ రాష్ట్రాలలో ఎవరు అధికారం లో ఉన్న పర్వాలేదు కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సబ్బండ వర్గాల ప్రజలు నాయకులు, కార్యకర్తలు ఒకే తాటపైకి వచ్చి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ నాయకత్వం బలపరచి బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దక్షిణ భారత దేశంలో కూడా బిజెపి కి భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపి స్థానాల్లో బిజెపి నిలిపిన అభ్యర్థులను బలపరచి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వికసిత భారత్ కు తోడ్పాటు అందించాలన్నారు. మహాత్ముడు కలలుగన్న రామరాజ్యం రావాలంటే ఉత్తర భారత దేశం తోపాటు దక్షిణ భారత దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి మనసా వాచ కర్మణా సంపూర్ణ మద్దతు ఇచ్చి కమలం పువ్వు గుర్తు కు ఓటేయ్యాలని మరో సారి పిలుపునిచ్చారు.