ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 5:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల నుండి దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ మహిళలు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మహిళ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. మహిళలు అందరూ ఐకమత్యంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించు కోవాలని తెలిపారు.
అదేవిధంగా మరో అదనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు వ్యక్తిగత జీవితంతో పాటు మృతి జీవితంలో కూడా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలని అదేవిధంగా ఒత్తిడి లేని జీవితం గడపాలని సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు.. మహిళా ఉద్యోగులు ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు.
టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ మహిళా ఉద్యోగులకు అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ కె. వెంకటరమణ, డిడబ్ల్యూఓ శారద, డాక్టర్ పి రజిని, డాక్టర్ మమతారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, సహాధ్యక్షులు హేమ నాయక్, కోశాధికారి పాలకుర్తి సదానందం, జిల్లా బాధ్యులు యాకమ్మ, రమాదేవి, శ్రీజ్యోతి, రజిత, సునీత, నాయర్, సుశీల, మానస, మేఘన, శ్వేత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.