ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి

 

ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 13:ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో వచ్చే ఆర్జీదారులకు వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో అవసరమైతే సంబంధిత సమస్యను ఆర్జీ సమర్పించిన వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. సోమవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు, దరఖాస్తులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలకు సంబంధించి సమస్యలు తీర్చేందుకు నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సంబంధించి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking