తూప్రాన్ పట్టణం దుకాణాల ముందు ఉన్న ఫుట్ పాత్ అక్రమిస్తే చర్యలు.

 

ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు.

తూప్రాన్, నవంబర్, 12.
ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలో దుకాణాల ముందు గల పుట్ పాత్ పై ఎలాంటి వస్తువులు కానీ, దుకాణాలు పెట్టడం దురాక్రమణగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. పూట్ పాత్ నిర్మించింది కేవలం ప్రజలు నడువడానికేనని తెలిపారు. షాప్ యజమానులు ఈ విషయం గమనించి వెంటనే దుకాణం ముందు పెట్టిన వస్తువులను షాప్ లోపల పెట్టుకొని వ్యాపారం చేయాలని సూచించారు. ఒక వేళ అలాగే వస్తువులు పెట్టితే సీజ్ చేసి మున్సిపల్ సిబ్బందితో ట్రాక్టర్ లో తరలిస్తామని హెచ్చరించారు. అలాగే వ్యాపారులకు ముఖ్య సూచన చేస్తూ ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పై విషయాల పై పోకస్ చేసి స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి దుకాణం షాప్ టు షాప్ తనిఖీలు చేపడతాం అని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రఘువరన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking