ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 12 : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 17,18 తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.సి.పి.ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్,బెల్లంపల్లి ఎ.ఆర్.ఎ.సి.పి. సుందర్,జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, రూట్ అధికారులతో కలిసి ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో గ్రూప్-3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని, గ్రూప్-3 పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.17 వ తేదీన ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు,మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు,18 వ తేదీ ఉదయం10.00 గంటల నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని,ఉదయం పరీక్షకు ఉదయం 9.30 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటలకు వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు.పరీక్షా కేంద్రంలోని ముఖ్య పర్యవేక్షకులకు మాత్రమే మొబైల్ అనుమతి ఉంటుందని,ఎవరికీ ఉండదని,ప్రశ్నాపత్రాలు,ఓ.ఎం.ఆర్.షీట్లు తరలించే రూట్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని,శాఖ అధికారులుగా తహశిల్దార్/ఆపైన స్థాయి అధికారులను నియమించడం జరిగిందని,పరీక్ష ముందురోజు పరీక్షా కేంద్రానికి సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, త్రాగునీటి వసతి కల్పించాలని,సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని,హాజరు పట్టికలు, ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్.షీట్లను పరిశీలకులు పర్యవేక్షించాలని తెలిపారు.బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వకుండా ఏ అభ్యర్థి కూడా పరీక్ష కేంద్రం నుండి బయటకు వెళ్ళరాదని, ఒకవేళ వెళ్ళినట్లయితే అట్టి అభ్యర్థి ఓ.ఎం.ఆర్. షీట్ పరిగణలోకి తీసుకోబడదని తెలిపారు.పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయా పరీక్షా కేంద్రాలకు సామాగ్రిని పంపిణీ చేయాలని, అభ్యర్థులు పాటించవలసిన నియమాలను హాల్ టిక్కెట్లపై కూడా ముద్రించడం జరిగిందని, అభ్యర్థులు ఈ నియమాలను తెలుసుకోవాలని తెలిపారు.పరీక్షా కేంద్రాలలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని,పరీక్ష హాజరయ్యే దివ్యాంగ అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించాలని తెలిపారు.డి.సి.పి.మాట్లాడుతూ…పరీక్ష నిర్వహణలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్. షీట్లు, సామాగ్రి తరలింపు ప్రక్రియ పోలీసు బందోబస్తు మధ్య జరుగుతుందని,పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించే సమయంలో చేపట్టే తనిఖీలలో భాగంగా మహిళలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు వారికి ఇచ్చిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, ప్రహారీగోడకు సమీపంలో ఉన్న కిటికీలు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.