ఎడ్ల బల ప్రదర్శన పోటీలలో గెలుపొందిన వారికి బోడేపూడి ట్రస్టు ద్వారా 10,000 రూపాయలను అందజేసిన బోడేపూడి రాజా
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామము లో పాలేరు శాసన సభ్యులు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సౌజన్యంతో రైతు సంబరాలు ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన లో నాలుగో స్థానంలో గెలుపొందిన వారికి 10,000 రూపాయలను ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా బోడేపూడి ట్రస్టు ద్వారా అందజేశారు . ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , జిల్లా నాయకులు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు