ద్రోహం చేసిన వారినీ కార్యకర్తలే శిక్షించాలి : కేటీఆర్

వికారాబాద్ ప్రజా బలం ప్రతినిధి 03 ఏప్రిల్ 2024: చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని తన ప్రసంగంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని అతనితో పాటు పట్నం మహేందర్ రెడ్డి కూడా బీ.ఆర్.ఎస్ పార్టీకి ద్రోహం చేశారని కార్యకర్తలు అభిమానులు గడ్డి పెట్టీ బుద్ధి చెబుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ నిప్పులు చెరిగారు. వీరిద్దరిని శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తల పైనే ఉందని, మంత్రి కావాలని రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి కలలు కంటున్న పట్నం మహేందర్ రెడ్డికి ఆ కలను ఒకసారి కాదు రెండు సార్లు కే.సీ.ఆర్, మహేందర్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించి కల నెరవేర్చారు. తదుపరి చేవెళ్ల ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ ముక్కూ మొహం తెలియని అనామకుడైన రంజిత్ రెడ్డిని కే.సీ.ఆర్ ఎంపీగా మీ అందరి సహకారంతో పోటీకి నిలబెట్టి గెలిపించారు, విశ్వాసం లేకుండా ఇవాళ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వీళ్లిద్దరిని శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. ప్రస్థుత పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుండె ధైర్యం ఉన్న నాయకుడిగా నేను వారితో పోటీ పడుతానని ముందుకు వచ్చిన మన కాసాని జ్ఞానేశ్వర్ లాంటి మంచి మనసున్న వ్యక్తిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కే.టీ.ఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ రంజిత్ రెడ్డి రన్నింగ్ రెడ్డిగా, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి విశ్వాసంలేని ఎడ్డిగా మారారు. వీరిద్దరూ మన కార్యకర్తల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మోదీ, రేవంత్ రెడ్డి దొరికారని సంబుర పడిపోతున్నారు. ఈ ఇద్దరికీ దిక్కు మొక్కు లేని రోజున ప్రజల అండ దండలతో ఇక్కడ ఉన్న ఈ కార్యకర్తలే వారిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారన్న విషయాన్ని ఆ ఇద్దరు నాయకులు మరిచిపోతున్నారు. 2014 లో 2019 ఎన్నికల్లో వారి కోసం మీరందరూ పని చేశారనీ, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు, గెలిపించిన పార్టీని పార్టీ కార్యకర్తలను వదిలేసి ఇతర పార్టీలకు వెళ్లారని కే.టీ.ఆర్ మండిపడ్డారు.

Activists should punish those who betrayed them: KTR

ప్రత్త్యయముగా అతి ఉత్సాహంతో విజృంభించి కార్యకర్తలందరూ కలసి కట్టుగా మన పార్టీనీ ముచ్చటగా మూడవసారి చేవెళ్ల నుంచి పార్లమెంట్ బీ.ఆర్.ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపిస్తారనే సంకల్పముతో విజయ కేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు ఉత్సాహ పరచినారు, ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి,ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి, యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking