విద్యుత్ సమస్యల పరిష్కారానికి 24 గంటల ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ఏర్పాటు. సూపర్డెంట్ (ఎస్ ఈ) జానకి రాములు.
మెదక్ ఏప్రిల్ 3 ప్రాజబలం న్యూస్:- మెదక్ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ఏర్పాటు చేయటం జరిగిందని మెదక్ ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జానకీరాములు తెలిపారు .మెదక్ పట్టణంలో విద్యుత్తు సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటారు. విద్యుత్ సమస్యల పై మెదక్ పట్టణంలోని ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఫోన్ నంబర్లకు 08452–222382, మొబైల్ నంబర్ 7382616080 కు సంప్రదించాలని తెలిపారు .అదే విధంగా మెదక్ జిల్లాలో ప్రసుతం డిమాండ్ 593 మెగా వాట్లు మరియు విద్యుత్ వినియోగం 9.7 మిలియన్ యూనిట్లు సరఫరా ఉన్నదని ఎస్ఈ జానకీరాములు తెలిపారు.