మెదక్ ఏప్రిల్ 3 ప్రాజబలం న్యూస్:-
రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ల మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్,జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు పేర్కొన్నారు.
లోకసభ ఎన్నికల నేపధ్యంలో
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజక వర్గాల వారీగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి , పటాన్చెరువు లకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యునిట్లు,
వి.వి.ప్యాట్ల మొదటి రాండమైజేషన్ ను ఈ ఎం ఎస్ వారు రూపోందించిన సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తూ ఆన్లైన్ లో జిల్లా ఎన్నికల అధికారి బుధవారం ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగింది.
మెదక్ జిల్లా లోని మెదక్ నియోజకవర్గం ,నర్సాపూర్ నియోజక వర్గలకు 584 పోలింగ్ కేంద్రాలకు సంబందించిన మొత్తం బ్యాలెట్ యూనిట్లు 729 కంట్రోల్ యూనిట్స్ 729 (125 శాతం), వివి ప్యాడ్స్ 816 (140 శాతం) ల మొదటి విడత ర్యాండమైజేషన్ లో ఎన్నికల నిబంధనల మేరకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల నిర్వహణలో నాలుగు జిల్లాల రేట్ చార్ట్ లను రూపొందించి సంబంధిత జిల్లాలకు పంపించడం జరిగిందని, త్వరలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 ఆసంబ్లీ సెగ్మెంట్లలో ఏకరూప ధరల పట్టికను
ధృవీకరించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారులు ఎన్నికల పర్యవేక్షకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.