రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 ఏప్రిల్ 2024:
తెలంగాణ జనజాతర సందర్భంగా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈనెల 6 వ తేదీ శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు జరగబోయే బహిరంగ సభకు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ విచ్చేయు చున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించ డానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు దుద్దెల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర సలహాదారులు వేం. నరేందర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తది తరులు పాల్గొన్నారు.