మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అదనపు కలెక్టర్

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం)ఖమ్మం ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని, ఆ మహాత్ముని స్పూర్తితో సమాజానికి సేవలందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్‌ నాయక్‌, శిక్షణ సహాయ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి.మాలతి, సిపిఓ ఏ. శ్రీనివాస్‌, కలెక్టరేట్ ఏవో అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking